తెలంగాణ

telangana

ETV Bharat / city

Heavy Rain in Hyderabad: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం.. - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాన దంచికొడుతున్నా... గణేశ్​ శోభాయాత్ర అదే ఉత్సాహంతో సాగుతోంది. అయితే భారీవర్షంతో రోడ్లపైకి నీరు చేరి అక్కడక్కడా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

rain
వర్షం

By

Published : Sep 19, 2021, 5:43 PM IST

హైదరాబాద్​లోని పలు చోట్ల వర్షం కురిసింది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, కీసర, రాంపల్లి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్‌, బాలానగర్, చింతల్, గాజులరామరం, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లి, మదీనాగూడ, హఫీజ్‌పేట, పాతబస్తీలోని పలు ప్రాంతాలు, సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్ వద్ద వర్షం కురిసింది.

కూకట్​పల్లి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. హైదర్​నగర్, కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్‌ ప్యాట్నీ, ప్యారడైస్, అల్వాల్‌, బోయిన్‌పల్లిలో వర్షం కురుస్తుండటంతో నిమజ్జనానికి బయలుదేరాల్సిన గణనాథులు మండపాలకు పరిమితమయ్యారు. రోడ్లపై వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

మొజంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్​బజార్, హుస్సేన్​సాగర్, పాతబస్తీ ప్రాంతాల​లో మోస్తం వాన(Rain in Hyderabad) పడింది. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షంలో(Rain in Hyderabad)నూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. చిరుజల్లుల్లో తడుస్తూ.. భక్తులు గణపతి ముందు స్టెప్పులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఆకాశమంత మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షం కురిసే అవకాశముందని కొందరు భక్తులు గణేశ్ శోభాయాత్ర నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. భారీ వాన పడితే.. వరదలో చిక్కుకుంటామేమోనని భయంతో వెనుదిరుగుతున్నారు. ఇంకొందరు మాత్రం జల్లుల్లో తడుస్తూ.. గణేశుణ్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.

Rain: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం..

ఇదీ చదవండి:Ganesh Immersion: వర్షంలోనూ వైభవంగా శోభాయాత్ర... ఒంటిగంట వరకు 231 విగ్రహాల నిమజ్జనం

ABOUT THE AUTHOR

...view details