తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం.. వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం - హైదరాబాద్​లో అక్కడక్కడ వర్షం

Hyderabad Rains
Hyderabad Rains

By

Published : Jun 5, 2022, 4:46 PM IST

15:42 June 05

హైదరాబాద్​లో అక్కడక్కడ వర్షం.. వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం

Hyderabad Rains: హైదరాబాద్​లోని పలు ప్రాంతంలో వర్షం కురిసింది. ఉగ్రరూపం దాల్చిన భానుడి భగభగలతో అల్లాడిన నగరవాసులకు వరుణుడి రాకతో.. కాస్త ఉపశమనం లభించింది. వర్షపు జల్లులతో నిప్పులు కురిసినట్టు ఉన్న వాతావరణం కాస్త చల్లబడింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం కురిసింది. బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, నేరేడ్​మెట్, మల్కాజిగిరి ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. జీడిమెట్ల, సురారం, బహదూర్‌పల్లిలో వాన పడింది.

కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మొత్తానికి ఎండలు మండిపోతున్న సమయంలో వాన జల్లులు పడటం వల్ల వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగినట్టైంది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details