రోజూ భగభగ మండే భానుడు కాసింత బ్రేక్ తీసుకున్నాడు. ఎండలతో హీటెక్కిపోతున్న హైదరాబాద్‌పై వరుణుడు చల్లని కరుణ చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిపించి జనాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించాడు.
చల్లబడిన భానుడు... చిరుజల్లులతో వరుణుడు - hyderabad weather report
![చల్లబడిన భానుడు... చిరుజల్లులతో వరుణుడు Rain in many areas of Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11374670-836-11374670-1618221620719.jpg)
14:51 April 12
నగరంలో పలుచోట్ల వర్షం... ఆహ్లాదకరంగా వాతావరణం
సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, సంగీత్, ష్టేషన్, చిలకలగూడా, బోయిన్పల్లి, అల్వాల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎస్సార్‌నగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిశాయి. మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, ఎస్వీనగర్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. కుషాయిగూడ, దమ్మాయిగూడా, నాగారం, చర్లపల్లి, జవహార్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
మరోవైపు... సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులతో కూడిన వాన పడింది.
ఒక్కసారిగా కురిసిన చిరుజల్లులతో... వాతావరణం చల్లబడి ఆహ్లాద వాతావరణం నెలకొంది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతోన్న నగరవాసులు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.