భాగ్యనగరంలో వర్షం.. తడిసి ముద్దైన జనం.. - హైదరాబాద్లో వర్షం
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమై నాలాలు పొంగిపొర్లుతున్నాయి.

హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కుషాయిగూడ, కాప్రా, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ , హిమాయత్ నగర్, నారాయణ గూడ ప్రాంతాల్లో కురిసిన వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. సాయంత్రం వారి వారి గమ్య స్థానాలకు వెళ్లే వాహన దారులు, బాట సారులు, ఉద్యోగులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల ప్రజలు తడిసి ముద్దయ్యారు.
- ఇదీ చూడండి : 'పాము కరిచిందన్నా వైద్యులు వినలేదు..'