తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణ మార్పులను హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

rain-forecast-in-next-three-days-in-telangana by imd hyderabad
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వాతావరణ సూచన

By

Published : Nov 4, 2020, 7:39 PM IST

Updated : Nov 4, 2020, 10:38 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనుందని వివరించింది. ఇది తమిళనాడు తీరానికి దగ్గర్లో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనంతో విలీనమైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి:రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు

Last Updated : Nov 4, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details