Weather Forecast: ఇవాళ, రేపు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు - ap rains

09:25 March 03
Weather Forecast: ఇవాళ, రేపు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు
దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో రానున్న 24 గంటల్లో వర్ష సూచనలు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నానికి ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి.. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా సూచించారు. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశముందని స్పష్టం చేశారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం