'వర్షాల వల్ల.. సొంతిండ్లు ఖాళీ చేసి అద్దెకుండాల్సి వస్తోంది..' - hyderabad heavy rains
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ డివిజన్ అయ్యప్ప కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వరద నీరు చేరడంతో బయటికి వెళ్లి నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితి నెలకొంది. రెండుమూడేళ్లుగా చిన్న వర్షం పడినా.. కాలనీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికే కాలనీలో చాలామంది తమ సొంత ఇండ్లను ఖాళీ చేసి.. వేరే ప్రాంతాల్లో అద్దెకుంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చేసేలా కృషి చేయాలని కోరుతున్న స్థానికులతో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామి ముఖాముఖి..
Rain Effect on LB Nagar ayyappa colony people