హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి... సరూర్‌నగర్ చెరువు కింద ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గడ్డి అన్నారం , కోదండరాం నగర్ కాలనీ, బృందావనం కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, చైతన్యపురి , కమలానగర్, సైదాబాద్ డివిజన్, రెడ్డి కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది.
భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు - రోడ్లపైకి భారీ వరద
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్ జలమయమైంది. రోడ్లపైకి భారీగా నీరు చేరి... కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడ్డ ప్రతిసారి చెరువులా మారి పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
రోడ్లపైకి భారీగా నీరు చేరడం వల్ల కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటి ప్రవాహానికి ద్విచక్రవాహనాలు సైతం కొట్టుకుపోయాయి. సరూర్‌నగర్‌లో వర్షం పడ్డ ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. వర్షం తగ్గిన చాలాసేపటికి కూడా వరద ప్రవాహం తగ్గడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు