భాగ్యనగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సఫారీ పార్క్‌తో సహా మరికొన్ని స్థలాల్లో వాన నీరు నిలిచిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వర్షం ఎఫెక్ట్: నెహ్రూ జూలాజికల్ పార్క్ బంద్ - బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కు
వర్షం కారణంగా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను మూసివేశారు. సఫారీ పార్క్‌తో సహా మరికొన్ని స్థలాల్లో వాన నీరు నిలవడం వల్ల జూపార్కు ను బంద్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వర్షం ఎఫెక్ట్: నెహ్రూ జూలాజికల్ పార్క్ బంద్
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఈనెల 6 నుంచి తెరుచుకుంది. లాక్డౌన్ కారణంగా మార్చి 15న మూసివేయబడ్డ జూపార్కు.. కొవిడ్ నిబంధనల నడుమ తిరిగి ప్రారంభించారు. కానీ ప్రస్తుతం వర్షం కారణంగా బంద్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి :వరుణుడి ప్రతాపం.. మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురు