Rain Alert in Telangana: రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఇవాళ ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని వివరించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
రానున్న 3 రోజుల్లో మోస్తరు వానలు.. రేపు అత్యంత భారీ వర్షాలు..!
Rain Alert in Telangana: మూడు నాలుగు రోజులుగా రాష్ట్రాన్ని వర్షాలు ముసురుకోగా.. పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అంతలోనే వాతావరణ శాఖ నుంచి మళ్లీ అలర్ట్ రానే వచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
నిన్నటి ఉపరితల ఆవర్తనం, ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్.. ఇవాళ 20ఎన్ వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్ది దక్షిణం వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, పెండ్రా రోడ్, బలంగిర్, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు... ఈ రోజు, రేపు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని సంచాలకులు వెల్లడించారు.
ఇవీ చూడండి: