తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉన్నతాధికారుల వేధింపులతో రైల్వే కీ మెన్ ఆత్మహత్య - రైల్వే కీ మెన్ ఆత్మహత్య

ఉన్నతాధికారుల వేధింపులతో మనస్తాపానికి గురైన రైల్వే కీ మెన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకుని తాగేశాడు. అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

railway-key-men-commit-suicide-with-harassment-by-bosses
ఉన్నతాధికారుల వేధింపులతో రైల్వే కీ మెన్ ఆత్మహత్య

By

Published : Jun 4, 2020, 1:04 PM IST

ఉన్నతాధికారుల వేధింపులతో రైల్వే కీ మెన్ ఆత్మహత్య

రైల్వే ఉన్నత అధికారుల వేధింపులు తాళలేక రైల్వే కీ మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు అన్నీ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడిస్తూ గడ్డి మందును సేవించాడు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు గ్రామానికి చెందిన పెయ్యాల రాజు (39) రైల్వే శాఖలో కీ మెన్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను గతంలో జి.కొండూరు మండలం చెరువు మాధవరం రైల్వే స్టేషన్ ఏరియా పరిధిలో విధులు నిర్వర్తించాడు.

పదోన్నతి కూడా ఇవ్వలేదు

వాస్తవానికి ఇతనికి 28 గ్రేడ్ ఉద్యోగిగా గుర్తింపు ఉన్నప్పటికీ పదోన్నతి ఇవ్వలేదు. పైగా చెరువు మాధవరం రైల్వే స్టేషన్ ఏరియా నుంచి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ఏరియాకు బదిలీ చేశారు. అక్కడ కూడా ఇతనిపై ఉన్నత అధికారుల వేధింపులు ఆగలేదు. ఇతను జి.కొండూరులో సమీప బంధువుల ఇంట్లో అద్దెకు నివాసం ఉంటూ ఎర్రుపాలెంకు ప్రతి రోజు డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో పెయ్యల రాజు బుధవారం విధులకు హాజరయ్యాడు. రైల్వే ట్రాక్ పక్కన గడ్డిని తొలగించమని అతనికి అధికారులు బుధవారం హుకుం జారీ చేశారు.

మానసిక క్షోభకు గురైన రాజు..

గడ్డి తొలగించే క్రమంలో అతను మరింత మానసిక క్షోభకు గురయ్యాడు. తనపై సంవత్సర కాలంగా జరుగుతున్న వేధింపుల గురించి సెల్ఫీ వీడియోలో పొందుపరిచాడు. అనంతరం గడ్డి మందును శీతల పానియంలో కలిపి సేవించాడు. అక్కడి నుంచి తన బైక్​పై జి.కొండూరు చేరుకొని ఇంట్లో కుటుంబ సభ్యులకు గడ్డి ముందు సేవించిన విషయాన్ని తెలియజేశాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటం వల్ల మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి చనిపోయినట్లు వైద్యులు నిర్ణయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details