దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లతో పాటు ప్రీమియం, మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి తేదీలు ప్రకటించే వరకు ముందస్తు రిజర్వేషన్లు ఉండబోవని స్పష్టంచేసింది.
మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లు బంద్
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిరైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 100 శాతం టికెట్ల రుసుం వెనక్కి ఇస్తామన్నారు.
మే 3 వరకు అన్ని ప్రయాణికుల రైళ్లు బంద్
రద్దైన రైళ్లకు సంబంధించిన టికెట్ ఛార్జీలను 100 శాతం వెనక్కి ఇస్తామని తెలిపింది. ఈ-టికెట్ రీఫండ్ దానంతట అదే వినియోగదారుల ఖాతాలో జమచేయడం జరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇవీచూడండి:విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు!