Rahul Gandhi vs Kavitha tweet war on Paddy Procurement: రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి సిగ్గుచేటని రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. వారి శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతన్నను ఇబ్బంది పెట్టడం ఆపి.. వారి వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజా కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్.. కవిత కౌంటర్ - rahul gandhi tweet on paddy procurement
Rahul Gandhi vs Kavitha tweet war on Paddy Procurement: రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరిని రాహుల్ గాంధీ ఎండగట్టారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. రాహుల్ ట్వీట్‌పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం చెప్పడం సరికాదని హితవు పలికారు.
![Rahul vs Kavitha Tweet: ధాన్యం సేకరణపై రాహుల్ ట్వీట్.. కవిత కౌంటర్ Rahul Gandhi vs Kavitha tweet war on Paddy Procurement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14866012-231-14866012-1648530442264.jpg)
ధాన్యం కొనుగోలుపై రాహుల్ ట్వీట్‌కు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్‌లో సంఘీభావం చెప్పడం సరికాదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదన్నారు. పంజాబ్, హరియాణాలో చేసినట్లు ధాన్యం సేకరించాలని కోరుతున్నామన్న కవిత.. తెరాస ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒకే దేశం - ఒకే సేకరణ విధానం కోసం పార్లమెంటులో రాహుల్ డిమాండ్ చేయాలన్నారు. తెరాస ఎంపీలకు మద్దతుగా నిలవాలని సూచించారు.
ఇదీ చదవండి:ఇక ప్రజా ఉద్యమాలు... భాజపా, తెరాసపై కాంగ్రెస్ పోరు