తెలంగాణ

telangana

ETV Bharat / city

RRR: పొరపాటా..? కావాలనే చేశారా?: రఘురామ

వైకాపా అధికారిక‌ వెబ్‌సైట్‌ నుంచి తన పేరును తొలగించడంపై రఘురామకృష్ణరాజు(MP RAGHURAMA) ఆ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్‌కు(CM JAGAN) లేఖ రాశారు. పేరు తొలగింపునకు గల కారణాలను తెలపాలని కోరారు.

Raghuramkrishna, MP Raghuramkrishna
రఘురామకృష్ణ, ఎంపీ రఘురామకృష్ణ

By

Published : Jul 3, 2021, 8:54 AM IST

వైకాపా అధికారిక‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి తన పేరును తొల‌గించ‌డంపై రఘురామకృష్ణరాజు(MP RAGHURAMA) స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. వైకాపా త‌ర‌ఫున గెలిచిన త‌న పేరును తొలగించ‌డంపై అందులో ప్ర‌స్తావించారు.

బహిష్కరించారా?

వైకాపా నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించారా..? అని ఎంపీ సందేహం వ్య‌క్తం చేశారు. పొర‌పాటున‌ పేరు తొల‌గించారా..? లేక కావాల‌నే చేశారా..? అనే విష‌యంపై స్పష్టత ఇవ్వాలని జ‌గ‌న్‌ను కోరారు.

స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటిస్తా..

కావాల‌నే త‌న పేరును వైకాపా వెబ్‌సైట్ నుంచి తొల‌గించిన‌ట్ల‌యితే పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన‌ట్లుగా భావిస్తానని.. 48 గంట‌ల్లో పేరు చేర్చ‌క‌పోతే పార్ల‌మెంట్ సెక్ర‌టేరియ‌ట్ దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో త‌నను తాను స్వతంత్ర అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవాల్సి వ‌స్తుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

28 మంది ఎంపీలు

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.

లేఖాస్త్రాలు..

నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఇప్పటికే.. రఘురామ ఏపీ సీఎం జగన్​పై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటి వరకు రాసిన లేఖల్లో సర్పంచ్ అధికారాల్లో కోత విధించొద్దని, తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. చెత్త సహా రాష్ట్రంలో విధించిన వివిధ పన్నుల భారం నుంచి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలనే విషయాన్నీ ఈ లేఖల్లో ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details