RRR Challenge to AP Govt: ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు వైకాపాకు అవకాశం ఇస్తున్నట్లు.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అప్పటి వరకు అనర్హత వేటు వేయించకపోతే.. రాజీనామా చేస్తానని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గెలవకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
MP fire on ap govt: అయితే.. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు.. పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అధికారులు తన ప్రతి కదలికనూ వీడియో తీస్తారని చెప్పారు. రెండు రోజులూ ఇంటి వద్దనే ఉండి వచ్చిన వారిని పలకరించి పంపుతానని ఎంపీ చెప్పారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.
ఫిబ్రవరి 5 వరకు టైం ఇస్తున్నా. ఆ లోపు చేయకపోతే మీకు చేతగాని వాళ్లుగా భావిస్తా. ఈలోపే నేను రాజీనామా చేయాలనుకుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి పదిసార్లు అనర్హత అని పలికితే చాలు. స్పీకర్ నాపై అనర్హత వేసినట్లుగా భావిస్తా. లేదంటే నేను గెలిచిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి మరొకరికి అప్పగించాలి. ఈనెల 13న నేను నా నియోజకవర్గానికి వెళ్తున్నా. - రఘురామ, వైకాపా ఎంపీ