ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, కుమార్తె ఇందు.. దిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సీఎం జగన్ ప్రభుత్వం తమ తండ్రిని వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెట్టి హింసిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజద్రోహం కేసు మోపడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకొని.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అమిత్‌షాను కలిసిన ఎంపీ రఘురామ కుటుంబ సభ్యులు - అమిత్‌షాతో ఎంపీ రఘరామ కుటుంబ సభ్యులు సమావేశం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఫిర్యాదు చేశారు.

mp raghurama son met amit sha