తెలంగాణ

telangana

ETV Bharat / city

RRR: 'పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి' - raghu rama on cm jagan

దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం.. వైకాపా నిర్ణయానికి వ్యతిరేకమా అని ఏపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ని​ ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేస్తారా అని ప్రశ్నించారు.

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి

By

Published : Jul 12, 2021, 10:00 PM IST

ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలన్న రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా.. మేనిఫెస్టోలో ఆంగ్ల మాధ్యమాన్ని చేర్చిన పార్టీ నిర్ణయం తప్పా.. లేక రాజ్యాంగ విలువలు కాపాడేందుకు పార్లమెంట్‌లో ప్రశ్నించిన నాది తప్పా.. అని ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ విజయసాయిరెడ్డి పదే పదే సభాపతిని కలవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు దిల్లీలో ఒక రోజు దీక్ష చేసిన సమయంలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వచ్చి సంఘీభావం తెలిపారని.. ఆ ఫొటో అడ్డంపెట్టుకుని మళ్లీ సభాపతికి ఫిర్యాదు చేయడం ఏంటని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి

"నా అభిప్రాయాలు మా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఆలయాలపై దాడులు జరగకూడదు అనేది మా పార్టీ నిర్ణయం కాదా? నాపై అనర్హత వేటుకు కారణమేంటి? ఆలయాలపై దాడులను నిరసించడం మా పార్టీ విధానానికి వ్యతిరేకమా? మా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను చేసిన తప్పేంటో చెప్పాలి. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే అనర్హత వేటు వేస్తారా?"- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ

ఇదీ చదవండి:WARANGAL: వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల పేర్లు మార్పు

ABOUT THE AUTHOR

...view details