Radhe Shyam Movie: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాంలో రాధే శ్యామ్ బెనిఫిట్ షోను అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఎస్వీసి థియేటర్లో అనుమతి లేకుండా బెనిఫిట్ షో వేశారని అధికారులు థియేటర్‌కు తాళాలు వేశారు. థియేటర్లో సినిమా ప్రదర్శించవద్దని నోటీసులు అంటించారు. థియేటర్‌కు తాళాలు వేయడంతో ప్రభాస్ అభిమానులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టికెట్ ధర పెంపునకు అనుమతి..
రాధేశ్యామ్ సినిమా ప్రీమియం టికెట్ ధరను రూ.25 పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్లు వెచ్చిస్తే టికెట్ ధరను పెంచుకునే అవకాశాన్ని నిర్మాతలకు ప్రభుత్వం కల్పించింది. సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు ఖర్చైనట్లు నిర్మాణ సంస్థ బిల్లులు ప్రభుత్వానికి సమర్పించటంతో.. ఈ మేరకు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది.
లవర్‌బాయ్‌గా ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 1970 నాటి పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటించింది.
ఇదీ చదవండి:'ప్రతి షోకు 100 టికెట్లు ఇవ్వాలి'.. మేయర్ లేఖ కలకలం..!