తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారికి సప్తవాహన సేవలు... జనసంద్రంగా తిరుమాడవీధులు - తిరుమలలో రథసప్తమి వేడుకలు

రథ సప్తమి(సూర్య జయంతి)ని పురస్కరించుకుని తిరుమలలో స్వామివారికి సప్తవాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు.. ఏడు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలైన వాహన సేవ కన్నులపండువగా జరుగుతోంది.

tirumala news
శ్రీవారికి సప్తవాహన సేవలు... జనసంద్రంగా తిరుమాడవీధులు

By

Published : Feb 19, 2021, 10:43 AM IST

Updated : Feb 19, 2021, 6:27 PM IST

తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తరువాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు.

శ్రీవారికి సప్తవాహన సేవలు... జనసంద్రంగా తిరుమాడవీధులు

ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. 11 గంటల నుంచి 12 వరకు గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు.. ప్రస్తుతం హనుమంత వాహనంపై ఉరేగుతున్నారు.

శ్రీవారికి సప్తవాహన సేవలు... జనసంద్రంగా తిరుమాడవీధులు

మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై విహరించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారికి సప్తవాహన సేవలు... జనసంద్రంగా తిరుమాడవీధులు

పోటెత్తిన భక్తులు...

ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు భక్త జనసంద్రంగా మారాయి.

ఇదీ చదవండి:రియల్ హీరోలకు పది రెట్ల నజరానా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం

Last Updated : Feb 19, 2021, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details