మహిళా సాధికారతపై రూపొందించిన కొత్త లఘుచిత్రం ‘అమ్మాయి’ పోస్టర్ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ యూనిట్ సభ్యులతో కలిసి విడుదల చేశారు. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ లఘుచిత్రం విజయం సాధించాలని సీపీ ఆకాంక్షించారు.
మహిళా సాధికారతపై లఘుచిత్రం.. పోస్టర్ రిలీజ్ చేసిన రాచకొండ సీపీ
మహిళా సాధికారతపై రూపొందించిన లఘు చిత్రం “అమ్మాయి’ పోస్టర్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. యూనిట్ సభ్యుల నడుమ పోస్టర్ విడుదలైంది. అనుకోకుండా ఎదురైన సంఘటనలను మహిళలు ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఈ లఘుచిత్రంలో చూపించినట్టు తెలిపారు.
మహిళా సాధికారతపై లఘుచిత్రం.. పోస్టర్ రిలీజ్ చేసిన రాచకొండ సీపీ
మహిళలకు ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు, దాడులు, లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కోవాలి... ఎలా స్పందించాలి... తదితర అంశాలను ఈ లఘుచిత్రంలో చూపించినట్టు తెలిపారు. తమను తాము రక్షించుకోడానికి మహిళలు ఎలా ఉండాలనదే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశమని దర్శకుడు శశాంక్ తెలిపారు. పాఠశాలల్లోని బాలికల కోసం రాచకొండ పోలీసులు విద్యార్థి పోలీసు కాడెట్ పేరుతో.. ఆత్మరక్షణ కళ నిర్వహిస్తున్నారు. ప్రతి స్త్రీ తనను తాను రక్షించుకునే ఆయుధంగా మారాలని సీపీ సూచించారు.