గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. మానవ అక్రమ రవాణాపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కలిసి పనిచేస్తే మానవ అక్రమ రవాణాను అరికట్టొచ్చని తెలిపారు. ప్రభుత్వ శాఖలతో పాటు ఎన్జీవోల సహకారం అవసరమని తెలిపారు.
'మానవ అక్రమ రవాణా అడ్డుకట్టలో మీ సహకారం అవసరం' - human trafficking in telangana
మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలతో పాటు ఎన్జీవోల సహకారం కూడా అవసరమని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల పిల్లలను కాపాడామని, వారి కోసం వర్క్ సైట్ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు.
దేశంలో మొదటి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. రాష్ట్రంలో ఇలాంటివి 31 యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఈ యూనిట్ ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల పిల్లలను కాపాడినట్లు తెలిపారు. ఎన్జీవోలతో కలిసి కార్మికుల పిల్లల కోసం వర్క్ సైట్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. బిహార్ నుంచి వచ్చి తెలంగాణలో గాజుల తయారీ పరిశ్రమలో పనిచేసే పిల్లలను రక్షించినట్లు చెప్పారు. విజిట్ వీసా మీద అమ్మాయిలను బహ్రెయిన్‌కు పంపి అక్కడ వ్యభిచార గృహాలకు పంపించే ముఠాను కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మానవ అక్రమ రవాణా కట్టడి కావాలంటే ఎన్టీవోల సహకారం ఎంతో కీలకమని భగవత్ తెలిపారు.
- ఇదీ చూడండి :'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'