లాక్‌డౌన్ సడలింపులతో మళ్లీ చోరీలు పెరిగాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. హైదరాబాద్‌లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి, లక్షా 80 వేల నగదు, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ఈ ఇద్దరిపై పలు కేసులు నమోదైనట్లు మహేశ్ భగవత్ చెప్పారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు - రాచకొండ పోలీసులు
హైదరాబాద్‌లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా... చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్
గత నెలలో మేడిపల్లిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రితురాజ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రసాద్ సేన్ అనే వ్యక్తితో కలిసి, రెక్కీ నిర్వహించి శివారు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.