రాచకొండ కమిషనరేట్ పరిధిలో 'మార్గదర్షక్స్' కార్యక్రమంలో శిక్షణ పొందినవారికి ధ్రువీకరణ పత్రాలను సీపీ మహేశ్‌భగవత్ అందజేశారు. 159 మంది ఉన్న పోలీసుల బృందం.. వివిధ విషయ నిపుణులు, సలహాదారుల ద్వారా మహిళలు, సమాజ రక్షణ దిశగా ట్రైనింగ్ తీసుకున్నారు. మార్గదర్షక్స్ పోలీసులకు, బాధితులకు మధ్య వంతెనగా ఉండాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కార్యక్రమంలో మహేశ్ భగవత్‌తో పాటు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు.
'మార్గదర్షక్స్' ధ్రువీకరణ పత్రాలను అందజేసిన సీపీ మహేశ్ భగవత్
మహిళలు, సమాజ రక్షణ దిశగా వివిధ విషయ నిపుణులు, సలహాదారుల ద్వారా రాచకొండ కమిషనరేట్‌లో 159 మంది శిక్షణ పొందారు. వీరందరికీ సీపీ మహేశ్ భగవత్ 'మార్గదర్షక్స్' ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
'మార్గదర్షక్స్' ధ్రువీకరణ పత్రాలను అందజేసిన సీపీ మహేశ్ భగవత్
మహిళలు, పిల్లల సమస్యలను పరిష్కరించడంలో సీపీ మహేశ్ భగవత్ ముందంజలో ఉన్నందున సజ్జనార్ ఆయన్ను అభినందించారు. 'మార్గదర్షక్' కార్యక్రమం తమకెంతో ఉపయోగపడిందని శిక్షణ పొందిన వారు వివరించారు. శిక్షణ సమయంలో తమకు మద్దతు ఇచ్చిన రిసోర్స్ పర్సన్స్‌ను మహేశ్ భగవత్ సత్కరించారు. త్వరలోనే 'సంఘమిత్ర' అనే మరో కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సీపీ వివరించారు.
Last Updated : Nov 8, 2020, 8:27 AM IST