తెలంగాణ

telangana

ETV Bharat / city

'వలస కూలీలూ ! కరోనా తగ్గుతోంది.. ఇక్కడే పనిచేసుకోండి' - తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్-19 ప్రభావం తగ్గుతోన్న నేపథ్యంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వలస కూలీలతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని...రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమాన్ని అందిపుచ్చుకుని ఇక్కడే ఉపాధి పొందండి అంటూ సీపీ వారిని కోరారు.

హైదరాబాద్​లోనే ఉపాధి పొందండి : సీపీ
హైదరాబాద్​లోనే ఉపాధి పొందండి : సీపీ

By

Published : May 7, 2020, 5:57 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతోన్న వేళ వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లకుండా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ కోరారు. ఈ మేరకు వనస్థలిపురం పరిధిలోని వలస కూలీలు, తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు పల్లవి గార్డెన్​లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కొన్ని రాష్ట్రాలకు 'నో పర్మిషన్'

విషయం తెలుసుకున్న కమీషనర్ మహేశ్ భగవత్ అక్కడికి చేరుకుని వలస కూలీలతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, రేషన్ బియ్యం తీసుకున్నారా అని సీపీ ఆరా తీశారు. పలు రాష్ట్రాలకు వలస కూలీల ప్రయాణానికి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు.

త్వరలోనే అందరికీ ఉపాధి...

బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మాత్రం వెళ్లాలనుకునే కూలీలకు ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొందరలోనే పరిస్థితులు చక్కబడతాయని, అందరికీ ఉపాధి దొరుకుతుందని వలస కూలీల్లో ధైర్యాన్ని నింపారు.

ఇవీ చూడండి : టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్‌: నాగం

ABOUT THE AUTHOR

...view details