దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసులను స్మరిస్తూ.. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు.
అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ - flog day
దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎల్లప్పుడు స్మరించుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. రాచకొండ కమిషనరేట్‌లోని అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్
ఈ శిబిరంలో.. 1500 మందికి పైగా రక్తదానం చేసినట్లు మహేశ్ భగవత్ తెలిపారు. ఇండియ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన కమిషనరేట్ ప్రధాన కార్యాలయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ డీసీపీ శంకర్ నాయక్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :పోలీసుల సేవలు అజరామరం సీపీ అంజనీకుమార్