సహాయానికి సార్థకత - rachakonda cp
పోలీస్ కమిషనర్‌గా శాంతి భద్రతల పర్యవేక్షణే గాక దేశానికి సేవ చేయాలనుకుని సివిల్ సర్వీస్‌కు సన్నద్ధమవుతున్న యువకులకు సాయం చేస్తున్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీయువకులకు సలహాలు, సూచనలిస్తూ వారు అనుకున్నది సాధించేందుకు స్ఫూర్తినిస్తున్నారు. ఆయన సూచనలతో కార్మిక విభాగంలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులను సీపీ ఘనంగా సత్కరించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు హాజరవుతోన్న అభ్యర్థులకు గత కొన్నేళ్ల నుంచి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువు బాధ్యతలు తీసుకొని మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా ఆయన మార్గనిర్దేశం చేశారు. సీపీ సలహాలు, సూచనల మేరకు సన్నద్ధమైన అభ్యర్థులు సీఐఎస్, ఎఫ్సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ఎస్ఎస్బీ, ఐటీబీటీ విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్‌కు చాలా మంది ఎంపికయ్యారు. కమిషనరేట్ కార్యాలయంలో వారిని మహేశ్ భగవత్ ఈ రోజు సన్మానించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ రంజిత్ సిన్హా, సీఆర్పీఎఫ్ సౌతర్న్ సెక్టర్ ఎంఆర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- ఇదీ చూడండి : ప్రమాదకర అడవిలో మోదీ ఏం చేశారంటే...!