ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో అన్వర్ భాష అనే వ్యక్తి పెంచుతున్న కుందేలుకు ఒకే ఈతలో 16 పిల్లలు పుట్టాయి. కుందేళ్ల పెంపకాన్ని అన్వర్ బాషా అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన పెంచుతున్న ఒక కుందేలు శుక్రవారం వేకువజామున ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చింది.
ఒక కుందేలు.. 16 పిల్లలు..! - కర్నూలు జిల్లా కుందేళ్లు వార్తలు
కుందేలు సాధారణంగా ఒకేసారి 4లేదా 8 కుందేళ్లకు జన్మనిస్తుంది. కానీ ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్ద వంగలి గ్రామంలో ఆ కుందేలు మాత్రం ఏకంగా 16 కుందేళ్లకు జన్మనిచ్చింది. ఈ బుజ్జి బుజ్జి కుందేళ్లను చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలు వారు ఎగబడుతున్నారు.
ఒక కుందేలు.. 16 పిల్లలు..!
ఆ బుజ్జి కుందేళ్లను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన అని ఆళ్లగడ్డ పశు వైద్యులు డాక్టర్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా ఓ కుందేలు 4, లేదా 8 పిల్లలకు జన్మనిస్తుందని, అరుదుగా 12 కుందేళ్లకు జన్మనిచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఒకే ఈతలో 16 కుందేళ్లకు జన్మనివ్వటం చాలా చాలా అరుదన్నారు.
ఇవీ చూడండి: విలేజ్ లెర్నింగ్ సెంటర్లలో విద్యార్థులకు పాఠాలు