ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోలీసులు ఇచ్చే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ శిక్షణలో విద్యార్థులు ఇచ్చే పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీపీ సజ్జనార్, సోషల్ వెల్ఫేర్ బోర్డు సెక్రటరీ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు దగ్గుబాటి రానా పాల్గొన్నారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులతో గచ్చిబౌలి స్టేడియంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు రానా, సజ్జనార్‌లు విద్యార్థులతో కలిసి మార్చ్ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేడియంలో శిక్షణ పూర్తి చేసుకున్న 1250 మంది విద్యార్థులు నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను తిలకించారు. విద్యార్థి దశ నుంచే వారిలో సమాజం, దేశం పట్ల గౌరవం, బాధ్యత, సేవాభావం పెంచాలన్న ఉద్దేశ్యంతో ఈ శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.