ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన 'బహుళ' నవల ఆవిష్కరణ సభ.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, పీపుల్ స్టార్‌గా ప్రసిద్ధిగాంచిన ఆర్.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళింగాంధ్ర గుండె ఘోషగా వర్ణించ దగ్గ 470 పేజీల నవల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఆర్.నారాయణమూర్తి చేతుల మీదుగా 'బహుళ' నవల ఆవిష్కరణ - ఆర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా శ్రీకాకుళంలో బహుళ నవల ఆవిష్కరణ
కళింగాంధ్ర ఉద్యమ జీవితంపై రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన బహుళ నవలను.. ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు వందేళ్ల చరిత్రను గ్రామీణ భాషలో అక్షరీకరించారంటూ రచయితను పీపుల్‌స్టార్ అభినందించారు.
'బహుళ' నవల ఆవిష్కరణ
కళింగాంధ్ర ఉద్యమ జీవితాన్ని, పోరాట అనుభవాలను కళ్లకు కట్టినట్లు.. సుమారు వందేళ్ల చరిత్రను నూటికి నూరుపాళ్లు గ్రామీణ భాషలో అక్షరీకరించిన గ్రంథం 'బహుళ' అని నారాయణమూర్తి కొనియాడారు. ఒక నవల శోధించగల సత్యాన్ని 'బహుళ' ద్వారా ఆవిష్కరించారంటూ అభినందించారు. ప్రజల జీవితానుభవాలను ప్రతిబింబించే విశిష్టమైన రచనలు ఇంకెన్నో అప్పలనాయుడు చెయ్యాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలు రైతులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.