R Krishnaiah Comments: టాలీవుడ్ సినీయర్ నటుడు మోహన్‌బాబుపై బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బుందనే అహంకారంతో అగ్రకులానికి చెందిన మోహన్‌బాబు.. నాయీబ్రాహ్మణుడైన నాగశ్రీనుని కులం పేరుతో దూషించడాన్ని జాతీయ బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. నాయిబ్రాహ్మణ కులంతో పాటు బీసీ సంఘాలకు మోహన్‌బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
వెంటనే క్షమాపణలు చెప్పాలి..
"కేవలం ఒక్క శాతం కూడా లేని అగ్రవర్ణ కులానికి చెందిన మోహన్‌బాబు.. 56 శాతం జనాభా ఉన్న బీసీ కులాలను కించపరిస్తే ఉరుకునేదిలేదు. అగ్రకులానికి చెందిన వ్యక్తిననే ధైర్యంతో డబ్బు ఉందనే అహంకారంతో.. బీసీ కులాలవారిని దూషిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేద కులాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే.. బీసీ కులాలు తగిన గుణపాఠం నేర్పుతాయి. ఒకవేళ మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం చేసింది నాగశ్రీనునే అయితే.. సాక్ష్యాధారాలు చూపించాలి. అంతేకానీ.. కులంపేరుతో కించపరుస్తూ.. పరుషపదాలంతో దూషిస్తే.. చూస్తూ ఊరుకోం. వెంటనే నాయిబ్రాహ్మణ కులంతో పాటు బీసీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." -ఆర్. కృష్ణయ్య
మోహన్‌బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేదంటే.. ఇవీ చూడండి: