తెలంగాణ

telangana

ETV Bharat / city

అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు: వేముల

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డివిజన్లలో విజయం సాధించిన తెరాస కార్పొరేటర్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గెలుపొందిన కార్పొరేటర్లను మంత్రి అభినందించారు. మొత్తం 8 డివిజన్లకు గాను 7 డివిజన్లలో తెరాసని ప్రజలు గెలిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

quthbullapur corporators met minister vemula
అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు: వేముల

By

Published : Dec 5, 2020, 9:34 PM IST

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డివిజన్లలో విజయం సాధించిన తెరాస కార్పొరేటర్లను రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. గ్రేటర్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంఛార్జిగా వ్యవహరించిన మంత్రిని.. గెలుపొందిన కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తెరాస పార్టీకి ఓటేసి ఆశీర్వదించిన ప్రజందరికీ వేముల ధన్యవాదాలు తెలిపారు.

తాము ఆశించినన్ని స్థానాలు రాకపోయినప్పటికీ.. అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆశీర్వదించారన్నారు. మొత్తం 8 డివిజన్లలో 7 డివిజన్లు తెరాస కైవసం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'భారత్​ బంద్​'కు కార్మిక సంఘాల​ మద్దతు

ABOUT THE AUTHOR

...view details