తెలంగాణ

telangana

ETV Bharat / city

జాలర్లకు చిక్కిన 10 అడుగుల కొండచిలువ

చేపల కోసం విసిరిన వలలో కొండచిలువ చిక్కడం...  పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం లింగంపాడులో కలకలం రేపింది. మత్స్యకారులు పంట కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లగా... జాలర్లకు 10 అడుగుల పొడవున్న కొండచిలువ చిక్కటంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

A 10-foot python entangled with fishermen
జాలర్లకు చిక్కిన 10 అడుగుల కొండచిలువ

By

Published : Nov 13, 2020, 2:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం లింగంపాడు గ్రామంలో కొండ చిలువ కలకలం రేపింది. గ్రామంలోని పంట కాలువలో మత్స్యకారులు చేపలు పడుతుండగా వలలో 10 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ చిక్కింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కొండచిలువను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు.

గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు కొండ చిలువను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటిలో కొండచిలువ కొట్టుకు వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు.

జాలర్లకు చిక్కిన 10 అడుగుల కొండచిలువ

ABOUT THE AUTHOR

...view details