ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని కృష్ణాపురం గ్రామం పంటపొలాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పొలం పనులు చేసుకుంటుండగా చెట్ల మధ్య కనిపించిన కొండ చిలువను చూసి భయంతో పరుగులు తీశారు. మరికొందరిని తీసుకువచ్చి దాన్ని హతమార్చారు.
15 అడుగుల భారీ కొండ చిలువ.. రైతుల చేతిలో హతం - కృష్ణాపురంలో కొండచిలువ కలకలం వార్తలు
ఓ భారీ కొండచిలువ పంటపొలాల్లోకి వచ్చింది. దాన్ని చూసిన రైతులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 15 అడుగుల పొడవున్న కొండ చిలువను చంపేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురంలో జరిగింది.
15 అడుగుల భారీ కొండ చిలువ.. రైతుల చేతిలో హతం
కొండ చిలువ సుమారు 15 అడుగులు ఉంటుందని.. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఇంత భారీ చిలువను చూడలేదని రైతులు చెప్పారు. అయితే దాన్ని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని కొందరు వన్యప్రాణి ప్రేమికులు అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి:పెట్టుబడి పేరిట గాలం.. రూ.14 లక్షలు మాయం
TAGGED:
కృష్ణాపురంలో కొండచిలువ కలకలం