ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతి జీవకోన ప్రాంతంలో 12 అడుగుల భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. సమీపంలోని లింగేశ్వర ఆలయ ప్రాంతంలో భక్తులకు కనిపించింది. కొండచిలువను చూసిన స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు.
ఏపీలోని జీవకోన ప్రాంతంలో భారీ కొండచిలువ లభ్యం - big python found
ఏపీలోని తిరుపతిలో గల జీవకోన ప్రాంతంలో 12 అడుగుల భారీ కొండచిలువను స్థానికులు గుర్తించారు. ఈ విషయమై తితిదే అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్న సిబ్బంది అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
![ఏపీలోని జీవకోన ప్రాంతంలో భారీ కొండచిలువ లభ్యం big python found in jeevakoana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11806076-856-11806076-1621338080274.jpg)
జీవకోన ప్రాంతంలో 12 అడుగుల భారీ కొండచిలువ
జీవకోన ప్రాంతంలో 12 అడుగుల భారీ కొండచిలువ
ఆలయ పర్యవేక్షకులు తితిదే అటవీ ఉద్యోగులకు సమాచారం అందించారు. లింగేశ్వర ఆలయ ప్రాంతానికి చేరుకున్న సిబ్బంది చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం జనసంచారానికి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
ఇవీ చదవండి:'అధిక ధరలు వసూల్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు'