తెలంగాణ

telangana

ETV Bharat / city

జనావాసాల్లోకి కొండచిలువ.. పరుగులు తీసిన ప్రజలు - పెద్దకోట్లలో కొండచిలువను చూసి జనం పరుగులు

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమరి మండలం పెద్దకోట్లలో కొండచిలువ కలకలం సృష్టించింది. కొందరు యువకులు అటవీ శాఖకు సమాచారం అందించగా.. సిబ్బంది వచ్చి బంధించారు. చిత్రావతి జలాశయంలో నీరు నింపడం వల్లనే.. పాములు, కొండచిలువలు తమ నివాసాల్లోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆరోపించారు.

python-caught-in-peddakotla-village-of-tadimari-mandal
జనావాసాల్లోకి కొండచిలువ.. పరుగులు తీసిన ప్రజలు

By

Published : Nov 20, 2020, 10:35 PM IST

అడవుల్లో కనిపించే కొండచిలువ.. జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమరి మండలం పెద్దకోట్లలో జరిగిందీ ఘటన. కొండచిలువను చూసిన గ్రామస్థులు పరుగులు తీశారు. కొందరు యువకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువను బంధించారు.

చిత్రావతి జలాశయంలోకి 10 టీఎంసీల నీరు నింపడం వల్ల.. ఆ ప్రాంతంలో ఉన్న కొండచిలువలు, పాములు పెద్దకోట్ల గ్రామంలోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనావాసాల్లోకి కొండచిలువ.. పరుగులు తీసిన ప్రజలు

ఇదీ చూడండి: ఆడ శిశువును ఆసుపత్రిలో వదిలేసిపోయిన వృద్ధురాలు

ABOUT THE AUTHOR

...view details