'నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు ఎవరూ నమ్మవద్దు. కంగారు పడవద్దు... అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను' తన ఆరోగ్యంపై కార్యకర్తల కోసం ఏపీ మాజీ మంత్రి, రాష్ట్ర భాజపా సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు చేసిన చివరి ట్వీట్ ఇది.
కరోనా సోకినప్పటికీ మాణిక్యాలరావు ధైర్యం సడలిపోలేదు. కరోనాతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఓ వీడియోలో ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. కానీ అదే ఆయన చివరి వీడియో అయింది. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.