భారత మాజీ ప్రధాని దివంగత నేత.. పీవీ నరసింహారావు నిబద్ధతతో కూడిన కాంగ్రెస్ నేతని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొనియాడారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహించనున్న పీవీ శతజయంతి ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించారు.
ఎంతో సహనంతో..
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆన్‌లైన్ ద్వారా మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి పీవీ అని అభివర్ణించారు. పీవీ సంస్కరణల కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను ఎంతో సహనంతో విని సమాధానాలు ఇచ్చే ఉదాత్తమైన నేతగా పీవీని కొనియాడిన ప్రణబ్... పీవీ హయాంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌తోనే దేశంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశంసించారు.
మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన తొలి వార్షిక బడ్జెట్‌తో పీవీ నరసింహరావు...భారత్‌ను ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్లారు. అసాధారణ నిర్ణయాలు తీసుకొని, వాటిని అదే రీతిలో అమలు పర్చడంలో పీవీ నరసింహరావు దిట్ట. - ప్రణభ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి