కొవిడ్ లాంటి భయంకరమైన మహమ్మారి వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆక్సిజన్ స్టెరిలైజర్, రెస్పిరేటరీ ఉపకరణాన్ని మాజీ రక్షణ రంగశాస్త్రవేత్త కె.హెచ్.శాస్త్రి రూపొందించారు. భారత రక్షణ రంగంలో రేడియో, రాడార్ శాస్త్రవేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించిన ఈయన బయోవార్ లాంటి పరిస్థితులకు తాను రూపొందించిన ప్యూర్ ప్రాణా రక్షణ కల్పిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ ప్యూర్ ప్రాణా పరికరాన్ని ఆవిష్కరిస్తూ.. ఈ ప్రొడక్టు ప్యూర్ ప్రాడక్ట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ ద్వారా మార్కెట్లో లభ్యం కానుందని వెల్లడించారు.
Pure Prana: బాక్టీరియా, వైరస్లను నిర్వీర్యం చేసే ప్యూర్ ప్రాణా - హైదరాబాద్ తాజా వార్తలు
బాక్టీరియా, వైరస్లను నిర్వీర్యం చేసే ప్యూర్ ప్రాణా అనే పరికరాన్ని మాజీ రక్షణ రంగశాస్త్రవేత్త కె.హెచ్.శాస్త్రి రూపొందించారు. భారత రక్షణ రంగంలో రేడియో, రాడార్ శాస్త్రవేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించిన ఈయన బయోవార్ లాంటి పరిస్థితులకు తాను రూపొందించిన ప్యూర్ ప్రాణా రక్షణ కల్పిస్తుందని ప్రకటించారు.
ప్యూర్ ప్రాణా
కరోనా సహా గాలి ద్వారా వ్యాప్తి చెందే అన్ని రకాల వైరస్లు, వ్యాధులతో ఇది పోరాడుతుందని కె.హెచ్.శాస్త్రి తెలిపారు. తాను రూపొందించిన ఈ పరికరం నానో సాంకేతికత, అయోనైజేషన్ ప్రక్రియ సహాయంతో వైరస్, బాక్టీరియాలను పూర్తిగా నిర్వీర్యం చేసి స్వచ్ఛమైన గాలి తీసుకునేలా సహకరిస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి:NBW:ముగ్గురు కాంగ్రెస్ నేతలపై నాన్ బెయిలబుల్ వారెంట్
Last Updated : Aug 27, 2021, 9:22 AM IST