తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురందేశ్వరి భావోద్వేగం'

NTR Birth Anniversary 2022 : ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన దగ్గుబాటి పురందేశ్వరి తన తండ్రిని స్మరించుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ అంటే ఓ ప్రభంజనం అని.. ఆయనో సంచలనం అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. రూ.వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

NTR Birth Anniversary 2022
NTR Birth Anniversary 2022

By

Published : May 28, 2022, 10:03 AM IST

ఎన్టీఆర్ ఘాట్ వద్ద పురందేశ్వరి భావోద్వేగం

NTR Birth Anniversary 2022 : స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి నివాళులర్పించారు. అనంతరం తన తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ అనే పేరు ప్రతి తెలుగింటి గడప బతికున్నంత కాలం గుర్తుంటుందని అన్నారు.

రూ.వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు చేరుకున్నారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై స్పందించారు.

purandeswari About NTR : ‘‘నందమూరి తారక రామారావు ఒక సంచలనం. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఆ కమిటీలో ఉన్నారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించనున్నాం’’ అని పురందేశ్వరి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details