తెలంగాణ

telangana

ETV Bharat / city

cow record price: పుంగనూరు జాతి ఆవుకు రికార్డు ధర.. ఎన్ని లక్షలంటే? - అత్యధిక ధర పలికిన పుంగనూరు ఆవు

cow record price: పుంగనూరు జాతి ఆవు రికార్డు స్థాయిలో రూ.4.10 లక్షలు పలికింది. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివ కుమార్ అనే వ్యక్తి నుంచి హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఆవుని కొనుగోలు చేశారు.

cow record price
పుంగనూరు జాతి ఆవు

By

Published : Jul 24, 2022, 10:56 PM IST

cow record price: చిట్టి పొట్టి ఆకారంతో అందంగా.. ఆకర్షణీయంగా కన్పించే పుంగనూరు ఆవులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పాల దిగుబడి తక్కువే అయినా మేపు ఖర్చు పెద్దగా ఉండదు. ఒకప్పుడు పుంగనూరు ప్రాంతంలో ఎక్కువగా కన్పించే ఈ జాతి ఆవులు క్రమేపీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కొంతమంది రైతులు ఈ జాతి ఆవుల సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఆవులు ఇంటి వద్ద ఉంటే మంచి జరుగుతుందని నమ్మేవారి సంఖ్య పెరుగుతోంది. పుంగనూరు జాతి ఆవు రోజుకు 2 లేక 3 లీటర్ల పాలు ఇస్తోంది. ఈ పాలలో 8 శాతం వెన్న ఉంటోంది. సాధారణ జాతి ఆవులలో 3 లేక 4 శాతం మాత్రమే వెన్న ఉంటోంది.

పుంగనూరు జాతి ఆవుకు రికార్డు ధర.. ఎన్ని లక్షలంటే?

తెనాలి నుంచి హరిద్వార్‌కు:ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కంచర్ల శివకుమార్‌ వివిధ జాతులకు చెందిన ఆవులను పెంచుతున్నారు. ఈక్రమంలో అతని వద్ద పుంగనూరు జాతి ఆవు ఉందని తెలియడంతో హరిద్వార్‌లోని బాబా రాందేవ్‌ ఆశ్రమం నుంచి ప్రతినిధులు తెనాలి వచ్చి పరిశీలించారు. వారికి నచ్చడంతో ఏకంగా రూ.4.10లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పశువైద్యాధికారి నాగిరెడ్డి మాట్లాడుతూ... పుంగనూరు జాతి ఆవులకు మంచి డిమాండ్‌ ఉందని, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చన్నారు. పుంగనూరు ఆవు రూ.4.10లక్షల ధర పలకడంతో తెనాలి ప్రాంత రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details