Pulse Polio 2022: చిన్నారుల నిండు జీవితాన్ని సురక్షితం చేసేందుకు రెండు చుక్కలు వేసే సమయం వచ్చేసింది. చిన్నారుల్లో వైకల్యానికి కారణం అయ్యే పొలియో వైరస్ నుంచి బుజ్జాయిలను రక్షించుకునేందుకు ప్రభుత్వం పోలియో చుక్కల కార్యక్రమాలను ఏటా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో.. ఇప్పటికే జన సంచారం ఎక్కువగా ఉండే చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు టీవీ, రేడియోలలో ప్రకటనలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది.
50 లక్షల 14 వేల పల్స్ పోలియో డోస్లు..
రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల 31 వేల 907 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్టు పేర్కొన్న సర్కారు.. పోలియో చుక్కలు వేసేందుకు 23331 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని చిన్నారులందరికి పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసిన సర్కారు.. ప్రయాణాలలో ఉన్నవారి కోసం 869 ట్రాన్సిట్ కేంద్రాలు అందుబాటులో వుంటాయని పేర్కొంది. బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రహదారి కూడళ్లలో ట్రాన్సిట్ కేంద్రాలు వుంటాయని స్పష్టం చేసింది. 2337 మంది సూపర్ వైజర్లు, 869 మంది సంచార బృందాలు, 8589 మంది ఏఎన్ఎంలు, 27040 మంది ఆషా వర్కర్లు , 35353 అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కాగా ఇప్పటికే అన్ని జిల్లాలకు కలిపి 50 లక్షల 14 వేల పల్స్ పోలియో డోస్లు పంపినట్టు ప్రకటించింది.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యకమం నిర్వహిస్తున్న సర్కారు.. ఆదివారం చుక్కలు వేయించుకొని వారి కోసం రెండు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో డ్రాప్స్ అందించనునట్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: