వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌ను 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి సునీల్ యాదవ్ కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తీసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో అధికారులు కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్న సునీల్‌ను సాయంత్రం కస్టడీలోకి తీసుకుంటారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ప్రమేయంపై చాలా అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే రంగన్న వాంగ్మూలంలో కూడా సునీల్ పేరు ప్రస్తావించడంతో.. అతనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సీబీఐ కోర్టులో వాదించింది. సునీల్ యాదవ్‌ను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని కోర్టులో సీబీఐ వాదించడంతో ఏకీభవించిన న్యాయస్థానం.. 10 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుల్లో ఒకరైన వైకాపా కార్యకర్త యాదటి సునీల్ యాదవ్‌ను (26) సీబీఐ అరెస్టు చేసింది. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయనను సోమవారం రాత్రి గోవాలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు సునీల్ యాదవ్‌ను హాజరుపరిచారు. వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన యాదటి సునీల్‌యాదవ్ (26) ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది. అతని పాత్రకు పలు ఆధారాలు దర్యాప్తులో లభించాయని వివరించింది. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌గా పనిచేసిన రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో సునీల్‌యాదవ్ ప్రమేయం గురించి వెల్లడిస్తోందని చెప్పింది. ఈ హత్యలో ఇతర నిందితుల ప్రమేయం, ఎలా హత్య చేశారు? ఏ ఆయుధాలు వినియోగించారనేది తేల్చాలని, ఆయుధాల్ని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. వీటిన్నింటిపై సునీల్‌యాదవ్‌ను విచారించాలని న్యాయస్థానానికి చెప్పింది. అతనికి 14 రోజుల రిమాండు విధిస్తూ జడ్జి పవన్‌కుమార్ ఆదేశాలిచ్చారు. అతన్ని 13 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ వేయగా.. ఈ రోజు న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది.
సునీల్‌కు నిజాలు తెలుసు..