తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్నందున... రెండో రోజు చుట్టుపక్కల గల రోడ్లు మూసివేశారు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎటు వెళ్లాలో తెలియక... నానా తిప్పలు పడుతున్నారు. కొంతమంది పోలీసుల సలహాలతో వెళ్తుండగా... మరికొందరు వాగ్వివాదానికి దిగుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. బషీర్బాగ్, లిబర్టీ చౌరస్తాలు వాహనాలతో నిండిపోయాయి.
సచివాలయం కూల్చివేత పనులతో వాహనదారుల తిప్పలు - నగరంలో వాహనదారుల అవస్థలు
సచివాలయం పనులు కొనసాగుతున్నందున... చుట్టుపక్కల రహదారులు మూసివేశారు. ప్రధాన కూడళ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారు.
సచివాలయం కూల్చివేత పనులతో వాహనదారుల తిప్పలు