తెలంగాణ

telangana

ETV Bharat / city

కాచిగూడలో రైలు ప్రమాదంపై బహిరంగ విచారణ

ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే అధికారుల అంతర్గత విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో, హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయంలోని సిగ్నల్‌ వ్యవస్థలను అధికారులు పరిశీలించారు. రైల్వే భద్రతా కమిషనర్‌ నేతృత్వంలో ఇవాళ బహిరంగ విచారణ జరగనుంది.

కాచిగూడలో రైలు ప్రమాదంపై బహిరంగ విచారణ

By

Published : Nov 13, 2019, 5:04 AM IST

కాచిగూడ స్టేషన్‌లో అధికారులు, సిబ్బంది 27 గంటలు శ్రమించి పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లను ఈ స్టేషన్‌ నుంచి నడిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు బుధవారం నుంచి నడుస్తాయని అధికారులు తెలిపారు.

లోకో పైలట్‌ వల్లే ప్రమాదం...కేసు నమోదు..!
రైలు ప్రమాదానికి ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ కారకుడని దక్షిణ మధ్య రైల్వే అధికారుల అంతర్గత విచారణలో తేలింది. ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో, హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయంలోని సిగ్నల్‌ వ్యవస్థలను అధికారులు పరిశీలించారు.

ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా..?
ప్రతి రైలుకు ఒక సిగ్నల్‌ షార్టు ఉంటుంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఎంఎంటీఎస్‌ ముందుకు కదలి ఇంటర్‌సిటీని ఢీకొట్టిన సమయంలో రైల్వే షార్టు రెడ్‌ సిగ్నల్‌ చూపిస్తోందని అధికారుల విచారణలో తేలింది. అంటే లోకో పైలట్‌ రెడ్‌ సిగ్నల్‌ పడినప్పటికీ గమనించకుండానే ముందుకు వెళ్లినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

వెంట వెంటనే సిగ్నల్‌ మారింది..!
లోకోపైలట్లు సిగ్నల్స్‌ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. రెడ్‌ సిగ్నల్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ పడే వరకు ఆగి మరీ వెళ్తుంటారు. చాలా సమయాల్లో వెంట వెంటనే రెడ్‌ నుంచి గ్రీన్‌కు సిగ్నల్‌ మారుతుంది. ఇలానే అవుతుందని భావించి చంద్రశేఖర్‌ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్‌ నేతృత్వంలో బహిరంగ విచారణ జరగనుంది.
ఇదీ చదవండి: రైల్వే యాప్​తో సమాచారం.. సిగ్నల్​ ట్యాంపరింగ్​ చేసి దొంగతనాలు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details