హైదరాబాద్ మెట్రో రైలులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. చరవాణిలో పాటలు పెద్దగా పెట్టుకొని నృత్యం చేస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. సికింద్రాబాద్ నుంచి తార్నాక వెళ్తున్న మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి ప్రయాణికులు ఇతని ప్రవర్తనను చరవాణిలో చిత్రీకరించారు. అతను మద్యం మత్తులో ఇలా ప్రవర్తించినట్లు ప్రయాణికులు మెట్రో సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అతన్ని తార్నాక స్టేషన్లో అతన్ని దించేశారు.
మెట్రోలో వ్యక్తి హల్చల్ - మెట్రోలో వ్యక్తి హల్చల్
హైదరాబాద్ మెట్రోలో ఓ వ్యక్తి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. చరవాణిలో పెద్దగా పాటలు పెట్టుకొని నృత్యం చేశాడు. ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించగా అతన్ని తార్నాక స్టేషన్లో దించివేశారు.
మెట్రోలో వ్యక్తి హల్చల్