Wonder Book of Records: ఇరవై నాలుగు రోజుల్లో 153 పాఠశాలలను సందర్శించి 15వేల 480 మంది విద్యార్థులకి శిక్షణ పూర్తి చేసినందుకు ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటుసంపాదించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు ఆయన పేరును నమోదు చేస్తూ మెడల్, మెమెంటో, సర్టిఫికెట్ బ్యార్జ్, పెన్, బుక్ ఆఫ్ రికార్డ్ స్టిక్కర్స్ పంపించారు. ఆ అవార్డును ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్, తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ దేవెందర్ బండారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
'గత రెండు సంవత్సరాల నుంచి కరోనా విద్యా వ్యవస్థ మీద, విద్యార్థి ఆలోచన విధానం పైన చాలా ప్రభావం చూపింది. పాఠశాలలకి, ఉపాధ్యాయులకు దూరమై అనేక మంది విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోయారు. ఇటువంటి సమయంలో విద్యార్థుల్ని సరైన మార్గంలో తీసుకువచ్చేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడ్డాయి.'