Relationship Problems : "ఇరవై నాలుగేళ్లకు తెలివి, సామర్థ్యం, విచక్షణా జ్ఞానం, నిర్ణయాధికారం బాగానే ఉంటాయి. విడిపోయాక మళ్లీ ప్రేమ కబుర్లు, చనిపోతానని బెదిరించడం గమనిస్తే.. ఏదోలా లోబరచుకోవాలని చూస్తున్నాడు. విడిపోయాక మనసులు కలవడం కష్టమే. కాబట్టి ఈ విషయం ఆలోచించడం మానేస్తే చదువు మీద ధ్యాస పెట్టగలుగుతారు. సమయం వృథా చేసుకోకుండా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోండి!
నా కోసం చనిపోతానంటున్నాడు.. ఏం చేయాలి? - రిలేషన్‌షిప్ చిట్కాలు
Relationship Problems : నాకు 24 ఏళ్లు. నేనొక వ్యక్తిని ప్రేమించా. మా మధ్య గొడవల వల్ల తన మీద ఇష్టం పోయింది. విడిపోయాం. కానీ ఇప్పుడు నేను లేకపోతే చనిపోతానంటున్నాడు. నాకు భయంగా ఉంది. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా. ఏడాదిలో ఉద్యోగం రాకపోతే ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తామంటున్నారు. తనని ఎలా మార్చాలి? నా ధ్యాస చదువు మీదకు మరలాలి అంటే ఏం చేయాలి? - ఓ సోదరి
అతడిని కూడా జరిగింది మర్చిపోయి ఎదుగుదల కోసం ప్రయత్నించమనండి. ఒకవేళ మీకు అతడి మీద ఇంకా ప్రేమ ఉందంటే ఇరువైపుల అమ్మానాన్నలకూ చెప్పి వాళ్ల అనుమతితో నిర్ణయం తీసుకోండి. అయితే అది నిజంగా ఇష్టమా లేదా బెదిరిస్తున్నాడని లోబడుతున్నారా అని ఆలోచించండి. మొత్తానికి పెద్దవాళ్లతో స్పష్టంగా చెప్పండి. దాచి ఉంచితే ఆనక సమస్య జటిలమై మీవాళ్లు ఆందోళన చెందుతారు. అప్పుడు వాళ్లకి సాయం చేసే అవకాశమూ ఉండదని గుర్తుంచుకోండి. మొత్తానికి ఆలోచించి నిర్ణయం తీసుకోండి."
- డా.మండాది గౌరీదేవి, మానసిక నిపుణురాలు