తెలంగాణ

telangana

ETV Bharat / city

"క్యాన్సర్​ రోగులకు ఉచిత చికిత్స అందించండి" - Congress MLA Jagga Reddy Letter To CM,PM

రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్​ రోగులు పడుతున్న ఇబ్బందులను సంగారెడ్డి ఎమ్మెల్యే  జగ్గారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు పలు అంశాలు ప్రస్తావిస్తూ.. తెలంగాణలో ప్రజల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇది కూడా ఓ ప్రాజెక్టుగా భావించి మానవతా దృక్పథంతో రోగులకు బాసటగా నిలవాలని కోరారు.

"క్యాన్సర్​ రోగులకు ఉచిత చికిత్స అందించండి"

By

Published : Oct 30, 2019, 1:29 PM IST

క్యాన్సర్​కు ఉచిత చికిత్స అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. పలు అంశాలపై రోగులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. డెంగీ జ్వరంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయని పేర్కొన్నారు.

వీటితో పాటు ఇప్పుడు మరో మహమ్మారి క్యాన్సర్ బారిన పడుతున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. క్యాన్సర్ వల్ల చనిపోయే వారు ఎక్కువగా ఉన్నారని... ఆర్దిక ఇబ్బందుల వల్ల పేదలు చికిత్స చేయించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదని.. అన్ని జిల్లాల సమస్యగా గుర్తించాలని కోరారు. ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇది కూడా ఓ ప్రాజెక్టుగా భావించి మానవతా దృక్పథంతో రోగులకు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

"క్యాన్సర్​ రోగులకు ఉచిత చికిత్స అందించండి"

ఇదీ చదవండి: సికింద్రాబాద్‌ బోయినపల్లి మార్కెట్​ను ముట్టడించిన రైతులు

ABOUT THE AUTHOR

...view details