'సమ్మె ఉద్ధృతం... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు' - ts rtc strike breaking
ఆర్టీసీ సమ్మెకు సహకరిస్తున్న అందరికీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్క్షతలు తెలిపారు. 'సేవ్ ఆర్టీసీ' పేరిట రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని చెప్పారు.
రేపు 'సేవ్ ఆర్టీసీ' పేరిట రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ ఐకాస సమావేశం జరిగింది. అన్ని డిపోల్లో చేపట్టిన మౌనదీక్షలు, మానవహారాలు విజయవంతం అయ్యాయని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 51 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు ధన్యవాదాలు చెప్పారు. ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. 'సేవ్ ఆర్టీసీ' పేరిట రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. అన్ని డిపోల వద్ద బస్టాండ్‌లు, ప్రధాన కూడల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.