తెలంగాణ

telangana

నేడు రహదారుల దిగ్బంధం.. సాగు చట్టాల రద్దే ప్రధాన డిమాండ్​

By

Published : Feb 6, 2021, 5:37 AM IST

అఖిల భారత కిసాన్​ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు రహదారుల దిగ్బంధంలో వామపక్ష, తెజస శ్రేణులు పాల్గొంటాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దే ప్రధాన డిమాండ్​గా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి.

PROTEST ON FARM ACTS 2020 IN TELANGANA
నేడు రహదారుల దిగ్బంధం.. సాగు చట్టాల రద్దే ప్రధాన డిమాండ్​

నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, తెజస పార్టీలు రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి. అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు హయత్​నగర్ ఆర్టీసీ డిపో వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాజీవ్ రహదారి, అల్వాల్​ ఈ-సేవాకేంద్రం వద్ద, వరంగల్​ హైవే బోడుప్పల్ బస్​ డిపో వద్ద రహదారుల దిగ్బంధం నిర్వహిస్తున్నట్లు భారత కిసాన్‌ సంఘర్షణ కోఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ పశ్యపద్మ ప్రకటించారు.

ఇవీచూడండి:సభాముఖంగా సాగు చట్టాలపై మోదీ ప్రసంగం!

ABOUT THE AUTHOR

...view details